Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో 2జీ సేవలు నిలిపివేయాలి: ముఖేశ్‌ అంబానీ

stop 2g service mukesh ambani
  • భారత్‌ సహా ప్రపంచం మొత్తం 5జీని అభివృద్ధి చేస్తున్నాయి
  • ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వాడుతున్నారు
  • వినియోగదారులకు ప్రాథమిక ఇంటర్నెట్‌ సేవలు దూరం
భారత్‌ సహా ప్రపంచం మొత్తం 5జీని అభివృద్ధి చేస్తుంటే, మరోవైపు, దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్‌ సేవలకు దూరంగానే ఉన్నారని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్ ముఖేశ్‌ అంబానీ అన్నారు. దేశంలో 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 1995లో దేశంలో మొబైల్‌ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో పురోగతి సాధించామని చెప్పారు.

అప్పట్లో కాల్‌ చేసినవారు నిమిషానికి రూ.16 చెల్లించాల్సి వచ్చేదని అలాగే కాల్‌ రిసీవ్ చేసుకున్న వారు నిమిషానికి రూ.8 చెల్లించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు 4జీ కాల్స్‌ ఉచితంగా చేసుకుంటున్నారని చెప్పారు. మొబైల్‌లోనే వార్తలు చదువుకోవచ్చని, వీడియోలు చూడటం, వస్తువుల కొనుగోళ్లు చేయడం వంటి సేవలు కూడా సామాన్యులకు అందుతున్నాయని చెప్పారు. మొబైల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారని, అలాగే చాలా మంది సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగానే జరుపుతున్నారని ముఖేశ్ గుర్తు చేశారు.
Mukesh ambani
Reliance
2g

More Telugu News